దేవుడి మాన్యం భూమికి సరిహద్దులు ఏర్పాటు చేయాలి

జన చరిత్ర న్యూస్ పర్వతగిరి, సెప్టెంబర్ 21 పర్వతగిరి మండల కేంద్రంలోని వేణుగోపాల స్వామి దేవస్థానానికి సంబంధించిన భూమిని సర్వే చేసి, హద్దులు నిర్ణయించి సంరక్షించాలని కోరుతూ దేవస్థానం సభ్యులు మండల ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దేవస్థానానికి సంబంధించిన సర్వే నంబర్లు 932, 933, 934లో మొత్తం 4 ఎకరాల 5 గుంటల భూమి ఉండాల్సి ఉండగా, భూమిపై అనుమానం రావడంతో దేవస్థానం సభ్యులు ఇటీవల కొలతలు వేయించినట్లు తెలిపారు. కొలతల్లో 3 ఎకరాల 22 గుంటల భూమి మాత్రమే ఉన్నట్లు తేలిందని, మిగిలిన 23 గుంటల భూమి కనిపించకపోవడంతో కొందరు వ్యక్తులు ఆక్రమించి ఉండవచ్చని వారు అనుమానం వ్యక్తం చేశారు. దేవస్థానానికి చెందిన మాన్యం...