తమ్ముడిని కత్తితో పొడిచి హత్య చేసిన అన్న అరెస్ట్
24 గంటల్లో కేసును ఛేదించిన గీసుగొండ పోలీసులు..కత్తి,రక్తపు మరకలున్న దుస్తులు స్వాధీనం *తెలంగాణ వరంగల్ సెప్టెంబర్ 21* గీసుగొండ: గరీబ్‌నగర్‌లో తమ్ముడిని కత్తితో పొడిచి హత్య చేసిన అన్నను గీసుగొండ పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ హత్య కేసును 24 గంటల్లో ఛేదించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.గరీబ్‌నగర్‌లోని ఓ అద్దె ఇంట్లో ఈ నెల 19న రాత్రి సుమారు 9.30 గంటలకు ఎలుబాక ప్రసాద్(31)కత్తిపోట్లకు గురై మృతి చెందాడు.మృతుడి ఛాతి,వీపు,భుజంపై తీవ్ర గాయాలు గుర్తించారు.మృతుడి తల్లి ఎలుబాక సుజాత ఫిర్యాదు మేరకు గీసుగొండ పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.దర్యాప్తులో భాగంగా మృతుడి అన్న ఎలుబాక ప్రవీణ్(33)ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.తల్లి వద్ద...