గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు (శోభాయాత్రలో DJలకు అనుమతి లేదు): మహబూబాబాద్ టౌన్ డీఎస్పీ నంబూరు తిరుపతి రావు.*
*మహబూబాబాద్ పట్టణంలో 23-09-2026, బుధవారం నిర్వహించనున్న గణేష్ నిమజ్జనం సందర్భంగా నిజాం చెరువు (బతుకమ్మ కుంట) వద్ద నిమజ్జన కార్యక్రమంతో పాటు గణేష్ శోభాయాత్ర సాగే మార్గాల్లో జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు మహబూబాబాద్ టౌన్ డీఎస్పీ నంబూరు తిరుపతి రావు తెలిపారు.* *నిమజ్జన కార్యక్రమం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ సిబ్బందిని కీలక ప్రాంతాల్లో మోహరించడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ, నిరంతర పర్యవేక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నిమజ్జన ప్రాంతంలో డాగ్ స్క్వాడ్ ద్వారా ముందస్తు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.* *శోభాయాత్రలో DJలకు ఎలాంటి అనుమతి లేదని డీఎస్పీ గారు...