ఎంజీఎంలో ఉద్రిక్తత.. దాస్యం వినయ్ భాస్కర్‌ను అడ్డుకున్న పోలీసులు బీఆర్‌ఎస్ శ్రేణులు–పోలీసుల మధ్య తోపులాట.. ఎంజీఎం వద్ద ఉద్రిక్త వాతావరణం

వరంగల్: వరంగల్‌లోని ప్రతిష్టాత్మక ఎంజీఎం ఆసుపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆసుపత్రిలో వరుసగా పైకప్పు పెచ్చులు ఊడిపడుతున్న ఘటనల నేపథ్యంలో పరిస్థితులను పరిశీలించేందుకు వెళ్లిన ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌ను పోలీసులు ఆసుపత్రి ప్రధాన గేటు వద్ద అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ శ్రేణులు, పోలీసుల మధ్య తోపులాట జరిగినట్లు సమాచారం. ఇటీవల ఎంజీఎంలోని ఆరోగ్యశ్రీ వార్డులో పైకప్పు పెచ్చులు ఊడిపడటంతో పలువురు రోగులు గాయపడిన ఘటన కలకలం రేపింది. ఆ ఘటన మరవకముందే మంగళవారం మరోసారి ఎంజీఎంలోని ఆర్‌ఐసీయూ వార్డులో పైకప్పు పెచ్చులు ఊడిపడిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఆసుపత్రి భవనం నిర్వహణ,...