సీనియర్ జర్నలిస్ట్ ఎం.ఏ. వహీద్ గుల్షన్ జన్మదిన వేడుకలు
వరంగల్, సెప్టెంబర్ 21 (ప్రత్యేక ప్రతినిధి): వరంగల్ నగరంలోని మండి బజార్‌లో గల ప్రముఖ జన్ను చార్లీ కాంప్లెక్స్‌లో సీనియర్ జర్నలిస్ట్ ఎం.ఏ. వహీద్ గుల్షన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాంప్లెక్స్ యజమాని జన్ను హారూన్, మాజీ జీడబ్ల్యూఎంసీ కార్పొరేటర్, కాంప్లెక్స్ దుకాణదారులు, ఉర్దూ జర్నలిస్టుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి వహీద్ గుల్షన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వహీద్ గుల్షన్ నాలుగు దశాబ్దాలుగా ఉర్దూ జర్నలిజానికి అందిస్తున్న సేవలను పలువురు కొనియాడారు. సియాసత్, ఎతెమాద్ వంటి దినపత్రికలతో పాటు స్థానిక వారపత్రిక ‘ఉర్దూ హమారీ జుబాన్’కు సంపాదకుడిగా ఆయన సేవలందించారని గుర్తుచేశారు. నిర్భయమైన రచన, నిజాయితీ,...