హెచ్‌ఐవీ/ఎయిడ్స్, టీబీ, రక్తదానం మరియు ఇతర ఆరోగ్య కార్యక్రమాలపై జిల్లా స్థాయి క్విజ్ పోటీ నిర్వహణ
*విజేత లకు డి ఎం ఎచ్ ఓ డా. రాజా రెడ్డి చేతుల మీదుగా బహుమతి ప్రధానం* వరంగల్, సెప్టెంబర్ 22, 2026: హెచ్‌ఐవీ/ఎయిడ్స్, క్షయవ్యాధి (టీబీ), రక్తదానం మరియు ఇతర ఆరోగ్య కార్యక్రమాలపై జిల్లా స్థాయి క్విజ్ పోటీని వరంగల్‌లోని మట్వాడ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. 9వ తరగతి విద్యార్థులతో కూడిన 10 పాఠశాలల విద్యార్థులు ఈ క్విజ్ పోటీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థుల్లో హెచ్‌ఐవీ/ఎయిడ్స్, టీబీ, రక్తదానం మరియు వివిధ ఆరోగ్య సంబంధిత కార్యక్రమాలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యం. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజి రెడ్డి మాట్లాడుతూ, హెచ్‌ఐవీ/ఎయిడ్స్ మరియు టీబీ నివారణకు పిల్లల్లో అవగాహన కల్పించడం...