విశ్వబ్రాహ్మణ జర్నలిస్టుల నూతన కమిటీ సమావేశం

హనుమకొండ: తెలంగాణ విశ్వబ్రాహ్మణ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమకొండ–వరంగల్ జిల్లాలకు నూతనంగా ఎంపికైన జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులతో పాటు పలువురు విశ్వబ్రాహ్మణ జర్నలిస్టులు సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో సంఘం ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించి, కొత్తగా చేరిన సభ్యులను హనుమకొండ జిల్లా విశ్వబ్రాహ్మణ జర్నలిస్ట్ సంఘంలోకి ఆహ్వానించారు. అనంతరం సంఘం భవిష్యత్ కార్యాచరణ, అభివృద్ధి, సభ్యుల సంక్షేమానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. విశ్వబ్రాహ్మణ జర్నలిస్టుల ఐక్యతను మరింత బలోపేతం చేస్తూ, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సభ్యులకు సూచించారు. సంఘం అభివృద్ధి, సభ్యుల సంక్షేమం కోసం సమష్టిగా పనిచేస్తామని నూతన కమిటీ సభ్యులు ప్రమాణ...