ఎంజీఎం సమస్యలు పరిష్కరించాలి వినయ్ భాస్కర్‌పై పోలీసుల దౌర్జన్యం అప్రజాస్వామికం మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
*తెలంగాణ/వరంగల్,సెప్టెంబర్ 24* వరంగల్: ప్రజా సమస్యలపై ప్రశ్నించిన మాజీ మంత్రి,ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌పై పోలీసులు వ్యవహరించిన తీరు అప్రజాస్వామికమని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే అక్రమంగా అరెస్టులు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.ఎంజీఎం ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.వరంగల్‌లోని తన నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నరేందర్ మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పాలకుల అండతో నగరంలో సరికొత్త దాడుల సంస్కృతి కొనసాగుతోందని ఆరోపించారు.ఎంజీఎంలో వైద్య వ్యవస్థ కుప్పకూలుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.ఆసుపత్రిలో ఎక్స్‌రే యంత్రాలు పనిచేయకపోవడం,ల్యాబ్‌లు మూతపడటం వల్ల రోగులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.కమీషన్ల కోసం రోగులను ప్రైవేట్ ల్యాబ్‌లకు పంపుతున్నారనే...