వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పటిష్ట ఏర్పాట్లు* *17 చెరువుల్లో 30 క్రేన్ల ఏర్పాటు..* *రూ.2 కోట్లతో ప్రత్యేక ఏర్పాట్లు అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జన కార్యక్రమాల నిర్వహణ

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వినాయక నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి, హనుమకొండ జిల్లా కలెక్టర్ శ్రీమతి చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు. బుధవారం వరంగల్ జిల్లా పరిధిలోని చిన్నవడ్డేపల్లి చెరువు వద్ద కుడా చైర్‌పర్సన్ శ్రీమతి గుండు సుధారాణి, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్నతో కలిసి ఆమె వినాయక నిమజ్జన కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ బల్దియా పరిధిలోని 17 చెరువుల్లో నిమజ్జనానికి 30 క్రేన్లను ఏర్పాటు చేసి, మొత్తం రూ.2 కోట్లతో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు...