వర్ధన్నపేటలో 100 మంది లబ్ధిదారులకు ఎగ్ కార్డుల పంపిణీ
వర్ధన్నపేట: నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ (ఎన్‌ఈసీసీ) ఆధ్వర్యంలో వర్ధన్నపేట నియోజకవర్గంలోని వర్ధన్నపేట, పర్వతగిరి, ఐనవోలు మండలాలకు చెందిన సుమారు 100 మంది లబ్ధిదారులకు ఎగ్ కార్డులను పంపిణీ చేశారు. వర్ధన్నపేటలోని శ్రీ సత్యనారాయణ స్వామి కోళ్ల ఫామ్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ శాసనసభ్యులు ఆరూరి రమేష్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎర్రబెల్లి వినీత్ రావు, యువ నాయకులు ఆరూరి విశాల్ పాల్గొని లబ్ధిదారులకు ఎగ్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోడిగుడ్డులో నాణ్యమైన ప్రోటీన్‌తో పాటు శరీరానికి అవసరమైన పలు విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాలు సమృద్ధిగా లభిస్తాయని...