కాంగ్రెస్ కరెంటు కుట్రలను బయటపెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ పర్యటన విజయవంతం

*పోలీసుల భారీ గేట్లను దూసుకుంటూ వెళ్లిన బిఆర్ఎస్ శ్రేణులు.* *కాంగ్రెస్ అంటేనే కరెంటు కష్టాలు.. కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ ఫార్మర్లు...* జన చరిత్ర న్యూస్ ( వర్ధన్నపేట) భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి.. కాంగ్రెస్ ఎక్కడ ఉంటే.. అక్కడ కరెంట్ ఉండదు. కాంగ్రెస్ కావాలా? కరెంట్ కావాలా? అని మేము ముందే చెప్పాం. మేం చెప్పిందే ఇప్పుడు యథాతథంగా జరుగుతుంది.. కేసీఆర్ హయాంలో రైతులకు 24 గంటలు కరెంట్ ఇచ్చాం.. ఇప్పుడు కరెంట్ కోతలతో రాష్ట్రం మొత్తం అల్లాడిపోతోంది... కాంగ్రెస్ చేసిన బొగ్గు స్కామ్ వల్లే నేడు రాష్ట్రంలో బొగ్గు దొరకక...