రవీంద్ర భారతి లో జరిగే చాకలి ఐలమ్మ జయంతి వేడుకలలో "స్టేట్ వైస్ చైర్మన్ "గా చోటు దక్కించుకున్న రాచకొండ రమేష్ బాబు
నారాయణపురం : మండల కేంద్రానికి చెందిన రాచకొండ రమేష్ బాబు శనివారం రవీంద్ర భారతిలో జరగబోయే చాకలి ఐలమ్మ జయంతి వేడుకలలో వీరనారి చాకలి ఐలమ్మ ఉత్సవ కమిటీ " స్టేట్ వైస్ చైర్మన్ గా అవకాశం కల్పించింది. తెలంగాణ వీరనారి చిట్యాల ఐలమ్మ 131 జయంతి కార్యక్రమం సందర్భంగా రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు, మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ఇలాంటి బృహత్తర కార్యక్రమానికి నాకు చోటు దక్కడం సంతోషంగా ఉందని రమేష్ బాబు తెలిపారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తితో, వారి ఆశయ సాధన కోసం ఈ వంచన లేకుండా కృషి చేస్తానని...