వినయ్ భాస్కర్‌ను పరామర్శించిన పల్లా, సత్యవతి, తక్కళ్లపల్లి
హనుమకొండ: ఎంజీఎం ఆసుపత్రి సందర్శన సందర్భంగా పోలీసుల చర్యలో గాయపడిన ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌ను జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు, ఇతర ముఖ్య నాయకులు పరామర్శించారు. వడ్డేపల్లిలోని వినయ్ భాస్కర్ నివాసానికి వెళ్లిన నాయకులు ఆయనను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంజీఎం ఆసుపత్రిలో రోగుల పరిస్థితి, వైద్య సౌకర్యాలను పరిశీలించేందుకు ప్రజల తరఫున వెళ్లిన వినయ్ భాస్కర్‌ను పోలీసులు అడ్డుకోవడాన్ని వారు ఖండించారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వెళ్తున్న వినయ్ భాస్కర్ పట్ల పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని నాయకులు...