కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి రాష్ట్ర నిర్వహణ కమిటీ ఏర్పాటు వైస్ చైర్మన్‌గా చిప్ప వెంకటేశ్వర్లు నేత నియామకం

వరంగల్, సెప్టెంబర్ 24 (ప్రతినిధి): ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలను ఈ నెల 27న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్ అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని తొలిసారిగా అధికారికంగా నిర్వహిస్తున్నారు. జయంతి వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షించి, కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర నిర్వహణ కమిటీని ఏర్పాటు చేసింది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కమిటీలో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి చిప్ప వెంకటేశ్వర్లు నేతను వైస్ చైర్మన్‌గా నియమించారు. వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించడం, సమన్వయం చేయడం, కార్యక్రమాన్ని...