మహిళల భద్రత కోసం - షీ టీమ్స్ హసన్ పర్తి లోని సుమతి రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ లో షీ టీం ఎస్సై స్వాతి అవగాహన సదస్సు

నేరాలు, అఘాయిత్యాలు పెరుగుతున్న నేటి కాలంలో నేరాల అదుపులో అందరు భాగస్వామ్యం కావాలని తమవంతు బాధ్యతలను నిర్వర్తించాలని, జాగ్రత్తతో మెలగడం వల్ల మహిళల మీద జరిగే నేరాలను అదుపు చేయవచ్చని వరంగల్ షీ టీమ్ ఎస్సై స్వాతి అన్నారు. హసన్ పర్తి లోని సుమతి రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ లో విద్యార్థినిలతో సైబర్ నేరాలు, మహిళలపై జరిగే అత్యాచారాలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల పట్ల అవగాహన కలిగి ఉండాలని కోరారు. ఈ సందర్భంగా వరంగల్ షీ టీమ్ ఎస్సై స్వాతి మాట్లాడుతూ అమ్మాయిలు ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, స్నాప్ చాట్, టెలిగ్రామ్ లాంటి సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫొటోలు, వివరాలు పంచుకోవడంలో జాగ్రత్త...