సీరత్-ఉన్-నబీ క్విజ్ విజేతలకు బహుమతులు
*తెలంగాణ/వరంగల్,సెప్టెంబర్ 25* జనగామ: జమీయత్ ఉలమా జనగామ శాఖ ఆధ్వర్యంలో మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజీలో నిర్వహించిన సీరత్-ఉన్-నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లామిక్ క్విజ్–2026 బహుమతుల ప్రదానోత్సవం శుక్రవారం పాఠశాల మసీదులో నిర్వహించారు.జమీయత్ ఉలమా జనగామ అధ్యక్షుడు మౌలానా అబ్దుర్ రహ్మాన్ సబీలీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో క్విజ్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు,పాల్గొన్న విద్యార్థులందరికీ ప్రోత్సాహక బహుమతులు,సర్టిఫికెట్లు అందజేశారు.ఈ సందర్భంగా క్విజ్ కన్వీనర్ మహమ్మద్ ఖ్వాజా ముజ్తహిదుద్దీన్ మాట్లాడుతూ మతపరమైన విద్య,సమాజ సంస్కరణ,యువతలో అవగాహన పెంపొందించేందుకు జమీయత్ ఉలమా కృషి చేస్తోందన్నారు.మౌలానా షాకిర్ హుస్సేన్ ఖాసిమీ మాట్లాడుతూ విద్యార్థుల్లో దైవభక్తి,ఇస్లామిక్ విజ్ఞానాన్ని పెంపొందించేందుకు క్విజ్ నిర్వహించినట్లు తెలిపారు.అడ్వకేట్ మహమ్మద్ జమాల్ షరీఫ్...