యూపీఐ ఛార్జీల ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోవాలి – AIYF జాతీయ కార్యదర్శి డా. సయ్యద్ వలి ఉల్లా ఖాద్రి డిమాండ్
వరంగల్, 25 సెప్టెంబర్ 2026 ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ (AIYF) వరంగల్ జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో నేడు వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ ఎదుట యూపీఐ లావాదేవీలపై ప్రతిపాదిత ఛార్జీలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం మరియు ప్రజల సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి AIYF జాతీయ కార్యదర్శి డా. సయ్యద్ వలి ఉల్లా ఖాద్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. యూపీఐ నేడు విద్యార్థులు, యువత, కార్మికులు, రైతులు, చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులు, మహిళలు, మధ్యతరగతి ప్రజలు సహా కోట్లాది మంది రోజువారీగా వినియోగిస్తున్న అత్యంత ముఖ్యమైన డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అని అన్నారు. యూపీఐ...