చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఘన నివాళులు
హైదరాబాద్, సెప్టెంబర్ 26: భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ప్రజల తెగువకు, పాలకుర్తి గడ్డ పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన చాకలి ఐలమ్మ నిప్పుకణికలా పోరాడి మహిళా లోకానికి స్ఫూర్తిగా నిలిచారని ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం చిరస్మరణీయమని అన్నారు. చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకుని మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి,...