వృద్ధాశ్రమంలో వైద్య శిబిరాన్ని పర్యవేక్షించిన డీఎంహెచ్‌ఓ డాక్టర్ అప్పయ్య

వయో వృద్ధుల వారోత్సవాల లో భాగంగా అన్ని వృద్దాశ్రమ ములలో మెడికల్ క్యాంప్ లను నిర్వహించడం జరిగింది అందులో భాగం గా ఈ రోజు పెద్దమ్మగడ్డ అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలోని స్వయం కృషి మహిళా సొసైటీలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య, సహృదయ వృద్దాశ్రమమును అడిషనల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ మదన్ మోహన్ లు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలోని వృద్ధులకు నిర్వహించిన ఆరోగ్య పరీక్షలు, వైద్య సేవలు, అవసరమైన మందుల పంపిణీ తదితర అంశాలను డీఎంహెచ్‌ఓ పరిశీలించారు. వృద్ధుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని, వారికి అవసరమైన...