జనగామ జిల్లాలో విశ్వబ్రాహ్మణ జర్నలిస్టుల ఎన్నికలు
తెలంగాణ విశ్వబ్రాహ్మణ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనగామ జిల్లా విశ్వబ్రాహ్మణ జర్నలిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించనున్నారు. అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తూములూరి సత్యనారాయణ ఆదేశాల మేరకు ఈ ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జనగామ జిల్లాలోని విశ్వబ్రాహ్మణ జర్నలిస్టులు ఐక్యంగా ఉండి, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, సంక్షేమం, వృత్తిపరమైన అభివృద్ధి కోసం సంఘాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో అర్హులైన విశ్వబ్రాహ్మణ జర్నలిస్టులు పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఎన్నికల అనంతరం నూతన జిల్లా కార్యవర్గం ఏర్పాటై, జర్నలిస్టుల సంక్షేమం కోసం మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. జర్నలిస్టుల ఐక్యతే లక్ష్యం... సంక్షేమమే...