సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం.ఎస్పీ నరసింహ.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడు కలను సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి ఎస్పీ నరసింహ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ కొండ లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలను స్మరించుకుంటూ స్వాతంత్ర ఉద్యమంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేశారని,తొలి దశ తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, ఆర్...