శ్రీ వెంకటేశ్వర బదిరుల పాఠశాలలో ప్రపంచ బదిరుల దినోత్సవం

*ముఖ్య అతిథిగా పాల్గొన్న వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి.నిర్మలా గీతాంబ మరియు డి ఎం ఎచ్ ఓ డా. బి.రాజా రెడ్డి* ప్రపంచ బదిరుల దినోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కందుకూరి.పూజ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర బదిరుల పాఠశాల, హనుమకొండ లోని వినికిడి లోపం గల విద్యార్థులకు , వరంగల్, హనుమకొండ జిల్లాల వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు డాక్టర్ బి రాజా రెడ్డి, డా.అప్పయ్య మరియు మెడికవర్ హాస్పిటల్, హంటర్ రోడ్, వరంగల్ వారి సహకారంతో ఉచిత వైద్య, ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో ముఖ్య అతిథిగా వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి.నిర్మలా...