ఎంఎల్‌హెచ్‌పీలు, సూపర్‌వైజర్లు విధుల్లో సమయపాలన పాటించాలి: డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి. రాజా రెడ్డి

రాయపర్తి (వర్ధన్నపేట) ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలలో పనిచేస్తున్న ఎంఎల్‌హెచ్‌పీలు, సూపర్‌వైజర్లతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజా రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ సిబ్బంది సమయపాలన పాటిస్తూ విధులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలలో ఓపీ సేవలను మరింత విస్తృతం చేసి, ఓపీ శాతాన్ని పెంచాలని ఆదేశించారు. ప్రజలకు అందుతున్న ఆరోగ్య సేవల నాణ్యతను మెరుగుపరచడంతో పాటు అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. జిల్లాలో ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించిన అన్ని ఇండికేటర్లను మెరుగుపరచడానికి కృషి చేయాలని సూచించారు....