మై యూత్ – మైహెల్త్– మై ప్రైడ్” కార్యక్రమం ద్వారా యువతకు ఆరోగ్య అవగాహన

నషా ముక్త్ భారత్ అభియాన్ – 100 ఆదివారాల శిబిరం లలో భాగంగా “నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్” కార్యక్రమాన్ని వరంగల్‌లోని యం జి యం ఆసుపత్రి కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా “మై యూత్ – మైహెల్త్– మై ప్రైడ్” పేరిట యువతకు ఆరోగ్య అవగాహన కార్యక్రమంతో పాటు హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. సత్య శారద గారు మాట్లాడుతూ, దేశ జనాభాలో యువత శాతం గణనీయంగా ఉందని, యువత మంచి అలవాట్లను...