అక్టోబర్ 3న ఇనామ్ ఆధ్వర్యంలో బహిరంగ సభ

ఎన్నికల ప్రక్రియ–మైనారిటీల పరిస్థితి పై చర్చ..రౌండ్‌టేబుల్‌ సమావేశంలో సన్నాహాలపై చర్చ* *తెలంగాణ /వరంగల్/హన్మకొండ,సెప్టెంబర్ 23* ఇండియన్ నేషనలిస్ట్ మూవ్‌మెంట్(ఇనామ్)ఆధ్వర్యంలో అక్టోబర్ 3న నిర్వహించనున్న బహిరంగ సభకు సంబంధించిన సన్నాహాలపై హన్మకొండలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.వివిధ రాజకీయ పార్టీల నాయకులు,ముస్లిం,క్రైస్తవ,సిక్కు మత పెద్దలు,మైనారిటీ సంఘాల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.ఇనామ్ జాతీయ అధ్యక్షుడు దివంగత మాతూరి కృష్ణ ప్రసాద్ స్మృతిలో ఈ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.అక్టోబర్ 3న సాయంత్రం 6 గంటలకు హన్మకొండ రైపురాలోని జకారియా ఫంక్షన్ హాల్‌లో ‘భారత ఎన్నికల ప్రక్రియ మరియు మైనారిటీల పరిస్థితి’ అనే అంశంపై బహిరంగ సభ జరగనుంది.సమావేశంలో మాతూరి కృష్ణ ప్రసాద్ మృతిపట్ల రౌండ్ టేబుల్ సమావేశంలో...