ఉద్యోగానికి వీడ్కోలు..ప్రజాసేవకు శ్రీకారం
*ఉద్యోగం నుంచి మాత్రమే విరమణ..ప్రజాసేవ నుంచి కాదు మహమ్మద్ సర్వర్ అహ్మద్* *ఘనంగా పదవీ విరమణ కార్యక్రమం..భారీగా తరలివచ్చిన ఉపాధ్యాయులు,అభిమానులు* *తెలంగాణ వరంగల్/ములుగు,సెప్టెంబర్ 28* ఉపాధ్యాయుడిగా వేలాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన మహమ్మద్ సర్వర్ అహ్మద్ ఉద్యోగ జీవితానికి సోమవారం వీడ్కోలు పలికారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బ్రదర్ షఫీ మోటివేషనల్ స్పీకర్ పాల్గొని శాలువా తో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు మరియు తన మాటలతో అందరినీ ఆకర్షించారు.అయితే ప్రజాసేవకు మాత్రం కొత్తగా శ్రీకారం చుట్టారు.వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేట పరిధిలోని నర్సింగాపురం ప్రాథమిక పాఠశాల ఆవరణలో సోమవారం మధ్యాహ్నం నిర్వహించిన ఆయన పదవీ విరమణ కార్యక్రమం ఆత్మీయత,అభిమానం,సేవా స్ఫూర్తితో ఘనంగా జరిగింది.సుదూర ప్రాంతాల...