కలెక్టరేట్ సిద్ధంగా ఉన్నా ప్రారంభించలేని ప్రభుత్వం.. కుటుంబ పదవులపై ఉన్న శ్రద్ధ వరంగల్ తూర్పు ప్రజలపై లేదా?” — ఎర్రబెల్లి ప్రదీప్ రావు
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాన్ని, స్థానిక ఎమ్మెల్యేను నిలదీస్తూ బీజేపీ రాష్ట్ర నాయకులు, వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ శ్రీ ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఆధ్వర్యంలో ఓ సిటీ క్యాంపు కార్యాలయం నుంచి నూతన వరంగల్ జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద నిరసనలో భాగంగా బూడిద గుమ్మడికాయలు కొట్టి దిష్టి తీసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రదీప్ రావు మాట్లాడుతూ.. భవనం నిర్మాణం పూర్తయినా నూతన వరంగల్ జిల్లా కలెక్టరేట్‌ను ఎందుకు ప్రారంభించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జిల్లా వరంగల్‌లో ఉన్నప్పుడు ప్రజలు ప్రతి ప్రభుత్వ పనికోసం హన్మకొండకు వెళ్లాల్సిన...