వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్‌లో బేతి అశోక్ బాబుకు ఘన సన్మానం
వరంగల్: వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్‌కు చెందిన వర్తక సంఘం, పరపతి సంఘం, కమిషన్ వ్యాపారస్తుల ఆధ్వర్యంలో నూతనంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన బేతి అశోక్ బాబును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. లక్ష్మీపురం కూరగాయల మార్కెట్‌కు హోల్సేల్ వ్యాపారస్తుడు మ సహచర నాయకుడు బేతి అశోక్ బాబు అంచెలంచెలుగా ఎదుగుతూ సామాజిక సేవా రంగంలో తనదైన గుర్తింపు తెచ్చుకొని, వరంగల్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్‌గా ఎన్నిక కావడం పట్ల మార్కెట్ వర్గాలు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. మార్కెట్‌కు చెందిన వ్యక్తి జిల్లా...