మహిళలపై అవగాహన కార్యక్రమం.. సంప్రదాయాలు, సంస్కృతిపై చైతన్యం.
మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నప్పటికీ.. మన సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపై ఉందని, అందరూ అవగాహన కలిగి ఉండాలని సీనియర్ అనాలసిస్ రుద్రోజు పరమేశ్వరి పేర్కొన్నారు. మహిళల హక్కులు, ఆత్మగౌరవం, వ్యక్తిగత భద్రతతో పాటు భారతీయ సంప్రదాయాలు, కట్టుబొట్టు, ఆచార వ్యవహారాలపై అవగాహన కల్పించారు. ప్రస్తుత కాలంలో ఆధునికతను స్వీకరించడంతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించే విధంగా దుస్తులు, నడవడి ఉండాలని సూచించారు. అయితే దుస్తుల విషయంలో ప్రతి వ్యక్తి స్వేచ్ఛను గౌరవిస్తూ.. సందర్భానికి, వయసుకు, ప్రదేశానికి అనుగుణంగా దుస్తులు ధరించేలా అవగాహన కల్పించడం తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల బాధ్యతగా పేర్కొన్నారు. పిల్లల విషయంలో తల్లిదండ్రుల...