పాఠశాలలలో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు
*జన చరిత్ర న్యూస్ పర్వతగిరి , సెప్టెంబర్ 28 లీడ్ డిస్ట్రిక్ట్ బ్యాంక్ వరంగల్, ఆర్థిక అక్షరాస్యత కేంద్రం వర్ధన్నపేట ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల, కస్తూరిబా పాఠశాలలో స్వచ్ఛతాహి సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజర్ జనార్ధన్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మేనేజర్ కృష్ణ విద్యార్థులతో కలిసి పాఠశాల పరిసరాలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పరిశుభ్రతను పాటిస్తూ స్వచ్ఛ భారత్ నిర్మాణానికి కృషి చేయాలని సూచించారు. వారానికి కనీసం రెండు గంటలు, సంవత్సరానికి 100 గంటలను పరిశుభ్రత కోసం కేటాయించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. అనంతరం...