శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో సహకార సంఘం చైర్మన్ల సన్మానం
జన చరిత్ర న్యూస్ పర్వతగిరి మండల కేంద్రంలో ఇటీవల నూతనంగా *పర్వతగిరి సహకార సంఘం చైర్మన్‌గా పిన్నింటి అనిల్ రావు, చౌటపల్లి సహకార సంఘం చైర్మన్‌గా అత్తి కుమారస్వామి* నియమితులైన సందర్భంగా పర్వతగిరి పట్టణ *శ్రీకృష్ణ యాదవ సంఘం* సభ్యులు వారిని శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా *పిన్నింటి అనిల్ రావు* మాట్లాడుతూ, యాదవ సోదరులకు సహకార సంఘం ద్వారా సహాయం, సహకారం అందించడంతో పాటు పారదర్శకంగా పనిచేస్తామని తెలిపారు. అలాగే గొర్రెలు, మేకలు, పశువుల ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. యాదవ సంఘం అభివృద్ధి, సమస్యలను *వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు* దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ...