ఘనంగా డీఈఓ కార్యాలయ ఉద్యోగి పదవీ విరమణ వేడుకలు..హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న విద్యాశాఖ అధికారులు,సిబ్బంది,కుటుంబ సభ్యులు

*తెలంగాణ/వరంగల్,అక్టోబర్ 29* హైదరాబాద్: డీఈఓ కార్యాలయంలో విధులు నిర్వహించిన మహమ్మద్ సర్ఫరాజ్ అలీ పదవీ విరమణ సందర్భంగా ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.డీఈఓ యాదయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి హైదరాబాద్ ఏడీఈఓ బి.శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.జిల్లా విద్యాశాఖ అధికారులు,కార్యాలయ సిబ్బంది,సహచరులు,కుటుంబ సభ్యులు పాల్గొని సర్ఫరాజ్ అలీకి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్,సోయల్,ఫయాజ్‌తో పాటు డీఈఓ కార్యాలయ సిబ్బంది,వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.అలాగే మహమ్మద్ లియాఖత్ అలీ,మహమ్మద్ ఇంతియాజ్ అలీ,మహమ్మద్ సుజాద్ అలీ,మిర్జా రషీద్,అన్వర్,ఫెరోజ్,మహమ్మద్ అద్నాన్,మహమ్మద్ లైక్,మహమ్మద్ అబ్బాస్ అలీ తదితరులు హాజరయ్యారు.సర్ఫరాజ్ అలీ సేవలను గుర్తుచేసుకుంటూ ఆయన పదవీ విరమణ అనంతర జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.