పట్టభద్రుల ఓటరు నమోదును వేగవంతం చేయాలి: ఎర్రబెల్లి దయాకర్ రావు

రాయపర్తి: వరంగల్–నల్గొండ–ఖమ్మం పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియపై వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మాజీ మంత్రి, పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి పాల్గొని మండల పార్టీ నాయకులు, గ్రామ పార్టీ ఇన్‌చార్జులు, కార్యకర్తలు, పట్టభద్రులతో ఓటరు నమోదు ప్రక్రియపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల కోసం ఓటరు నమోదుకు నవంబర్ 6వ తేదీ వరకు అవకాశం ఉన్నందున అర్హులైన పట్టభద్రులందరూ తమ ఓటు హక్కును నమోదు...