నంబర్ ప్లేట్లు లేని ద్విచక్ర వాహనాలు స్వాధీనం – కేసుల నమోదు, జరిమానాల విధింపు

. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయడం, రహదారి భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా హనుమకొండ, వరంగల్, కాజీపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల సందర్భంగా నంబర్ ప్లేట్లు లేకుండా ప్రయాణిస్తున్న 26 ద్విచక్ర వాహనాలను గుర్తించి నిబంధన ప్రకారం స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వాహనదారులపై కేసులు నమోదు చేసి, నిబంధనల ప్రకారం జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ టి. సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రతి వాహనానికి చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్‌ను తప్పనిసరిగా అమర్చుకోవాలని స్పష్టం చేశారు. నంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడపడం మోటారు వాహన చట్ట నిబంధనలకు...