పోలీస్ అమరవీరుల త్యాగాలపై విద్యార్థులకు అవగాహన సెయింట్ మేరీస్ పాఠశాల విద్యార్థులకు పోలీస్ స్టేషన్ సందర్శన

హసన్‌పర్తి: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని సెయింట్ మేరీస్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హసన్‌పర్తి పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఏ. మహేందర్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ సందర్శన (ఓపెన్ హౌస్) కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ ఏ. మహేందర్ విద్యార్థులకు పోలీస్ స్టేషన్ పనితీరు, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర, ఆయుధాల వినియోగం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గురించి వివరించారు. పోలీసుల విధులు, ప్రజల రక్షణ కోసం వారు చేపట్టే చర్యలను ప్రత్యక్షంగా తెలియజేశారు. దేశ రక్షణ, ప్రజల భద్రత కోసం ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను విద్యార్థులకు వివరించి, వారిలో దేశభక్తి,...