బొల్లికుంట వాగ్దేవి కళాశాలలో రక్తదాన శిబిరం 150 యూనిట్ల రక్తం సేకరణ – యువత స్వచ్ఛందంగా రక్తదానం
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ మార్గదర్శకత్వంలో మామునూరు ఉపవిభాగ పోలీసులు, ఎంజీఎం ఆసుపత్రి వైద్యుల సహకారంతో బొల్లికుంటలోని వాగ్దేవి కళాశాలలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో మొత్తం 150 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఈ రక్తదాన శిబిరాన్ని వరంగల్ తూర్పు జోన్ డీసీపీ అంకిత్ కుమార్ ప్రారంభించారు. రక్తదానం చేసిన వారికి హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఆధ్వర్యంలో పండ్లు, పండ్ల రసాలు, ఇతర అల్పాహార పదార్థాలను అందజేశారు. ఈ సందర్భంగా డీసీపీ అంకిత్ కుమార్ మాట్లాడుతూ, సమాజ రక్షణ కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. రక్తదానం అనేది...