‘ఓట్ బచావో – దేశ్ బచావో’ కార్యక్రమానికి హనుమకొండ కాంగ్రెస్ నాయకులు

‘ఓట్ బచావో – దేశ్ బచావో’ కార్యక్రమానికి హనుమకొండ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ జెండా ఊపి ప్రత్యేక బస్సులను ప్రారంభించిన డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి హనుమకొండ: ఢిల్లీలో నవంబర్ 1న జరగనున్న ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ కార్యక్రమంలో పాల్గొనేందుకు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ప్రత్యేక బస్సుల్లో హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్ నుంచి బయలుదేరిన నాయకుల బస్సులను జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జెండా ఊపి ప్రారంభించారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి విమానంలో నాయకులు ఢిల్లీకి చేరుకోనున్నారు....