అనుమతులు లేకుండా ఫైనాన్స్ కార్యకలాపాలు.. మహిళలకు వేధింపులు?

అనుమతులు లేకుండా ఫైనాన్స్ కార్యకలాపాలు.. మహిళలకు వేధింపులు? ఆర్థిక ఇబ్బందులతో ఫైనాన్స్‌ను ఆశ్రయిస్తున్న మహిళలను కొందరు ఫైనాన్స్ నిర్వాహకులు ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి. సంబంధిత అనుమతులు లేకుండానే ఫైనాన్స్ కార్యకలాపాలు నిర్వహిస్తూ, డబ్బుల కోసం వచ్చే మహిళల ఫోన్ నంబర్లు సేకరించి, పలుమార్లు ఫోన్ చేస్తూ రుణాల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంట్లోని ఆర్థిక సమస్యలు, కుటుంబ ఒత్తిళ్ల కారణంగా డబ్బుల కోసం ఫైనాన్స్ కార్యాలయాలను ఆశ్రయించే మహిళల పరిస్థితిని కొందరు దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రుణాల పేరుతో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, అనుచితంగా మాట్లాడటం లేదా ఇతర వేధింపులకు పాల్పడటం వంటి ఘటనలు జరిగితే...