సురక్షిత్ బచ్పన్ అభియాన్లో విద్యార్థులకు బాలల హక్కులు, బాలల రక్షణపై అవగాహన కార్యక్రమం
జన చరిత్ర న్యూస్ పర్వతగిరి వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కార్యదర్శి కందుకూరి. పూజ అధ్యక్షతన నిర్వహిస్తున్న "సురక్షిత్ బచ్పన్ అభియాన్" ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో భాగంగా పర్వతగిరి మండలంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం, తెలంగాణ మోడల్ స్కూల్ మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పర్వతగిరి ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థులకు బాలల హక్కులు, బాలల భద్రత, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వరంగల్ జిల్లా...