కాళేశ్వరం ప్రాజెక్టుపై మాట్లాడే ముందు మీ మూడేళ్ల పాలనలో తెలంగాణకు ఏం చేశారో చెప్పండి..బిఆర్ఎస్ పార్టీ నాయకులు బోట్ల మధు డిమాండ్

*కాళేశ్వరం ప్రాజెక్టుపై మాట్లాడే ముందు మీ మూడేళ్ల పాలనలో తెలంగాణకు ఏం చేశారో చెప్పండి* ,*బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బోట్ల మధు డిమాండ్** జన చరిత్ర న్యూస్ పర్వతగిరి మండల కేంద్రంలో శనివారం రోజున విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బోట్ల మధు మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం, మిషన్ కాకతీయ, రైతుబంధు, ఏ కారణం చేతనైన రైతు మరణానిస్తే దినం ఎల్లకముందే 5లక్షల రైతుబీమా అందించం. పథకాలతో తెలంగాణ అభివృద్ధికి బాటలు వేశాం. రైతులకు సాగునీరు, పెట్టుబడి సాయం అందించాం. ప్రాజెక్టుల్లో తప్పులుంటే నిరూపించండి. విచారణ జరపండి. చట్టపరంగా చర్యలు తీసుకోండి. కానీ రాజకీయ కక్షతో తెలంగాణ రైతాంగానికి నీరు...