బాలల రక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి
పిల్లల హక్కులు, మహిళల భద్రత, అక్రమ రవాణాపై అవగాహన కల్పించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ పర్వతగిరి: వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాలల రక్షణ, మహిళల భద్రత, మహిళలు మరియు బాలల అక్రమ రవాణా నివారణపై ‘సురక్షిత్ బచ్పన్ అభియాన్’ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. పూజ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 2 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...