ప్రజావాణికి అధికారులు గైర్హాజరు.. చర్యలు తీసుకోవడంలో ఎంపీడీవో నిర్లక్ష్యం!
ప్రజావాణికి అధికారులు గైర్హాజరు.. చర్యలు తీసుకోవడంలో ఎంపీడీవో నిర్లక్ష్యం! ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి 22 శాఖల అధికారులు హాజరు కావాల్సిందే – మారపల్లి మల్లేష్ డిమాండ్ టేకుమట్ల: మండల కేంద్రంలోని ఎంఈఓ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి 22 శాఖల అధికారులు హాజరు కావాల్సి ఉండగా, కేవలం ఐదు, ఆరు శాఖల అధికారులు మాత్రమే హాజరవుతున్నారని సిపిఐ ఎంఎల్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ ఆరోపించారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం పొందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. అయితే టేకుమట్ల మండలంలో ప్రజావాణికి సంబంధిత శాఖల అధికారులు హాజరు కాకపోవడంతో...