వరంగల్‌లో జోరుగా పేకాట.. ఎనిమిది మంది అరెస్ట్
వరంగల్‌లో జోరుగా పేకాట.. ఎనిమిది మంది అరెస్ట్ భిల్వా ఇన్ హోటల్‌లో టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి.. రూ.55,280 నగదు, 8 సెల్‌ఫోన్లు, 5 వాహనాలు స్వాధీనం వరంగల్, నవంబర్ 1: వరంగల్ నగరంలోని ఎస్‌వీపీ రోడ్డులో ఉన్న భిల్వా ఇన్ హోటల్‌లో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పేకాట నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం టాస్క్‌ఫోర్స్ బృందం దాడి చేసి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుంది. ఈ దాడిలో నిందితుల నుంచి రూ.55,280 నగదు, పేకాట ఆడేందుకు ఉపయోగించిన ఆటపత్తాలు, 8 సెల్‌ఫోన్లు, 5 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో వరంగల్‌లోని గిర్మాజిపేటకు చెందిన...