హనుమకొండలో ఉచిత హోమియోపతి వైద్య శిబిరం.. 100 మందికి పైగా లబ్ధి

హనుమకొండలో ఉచిత హోమియోపతి వైద్య శిబిరం.. 100 మందికి పైగా లబ్ధి **డాక్టర్ అనీస్ అహ్మద్ సిద్ధిఖీ చేతుల మీదుగా ప్రారంభం.. డాక్టర్ జావెద్, డాక్టర్ ఆయేషాలకు సన్మానం** **వరంగల్, నవంబర్ 2:** ముస్లిం వెల్ఫేర్ సొసైటీ వరంగల్ ఆధ్వర్యంలో హనుమకొండలోని బొక్కల గడ్డలో నిర్వహించిన ఉచిత హోమియోపతి వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది. ఈ శిబిరంలో వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 100 మందికి పైగా ప్రజలు ఉచిత వైద్య సలహాలు, చికిత్సతో పాటు మందులు పొందారు. ముస్లిం వెల్ఫేర్ సొసైటీ వరంగల్ అధ్యక్షుడు మహమ్మద్ సిరాజ్ అహ్మద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ అనీస్ అహ్మద్ సిద్ధిఖీ...