నిరుపేద విద్యార్థి చదువుకు రోటరీ క్లబ్ వరంగల్ సెంట్రల్ ఆర్థిక చేయూత

నిరుపేద విద్యార్థి చదువుకు రోటరీ క్లబ్ వరంగల్ సెంట్రల్ ఆర్థిక చేయూత వరంగల్: తండ్రిని కోల్పోయిన నిరుపేద విద్యార్థి చదువుకు రోటరీ క్లబ్ వరంగల్ సెంట్రల్ అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకుంది. లిటిల్ మాస్టర్ హైస్కూల్‌లో 1వ తరగతి చదువుతున్న కొంగ అరుష్‌కు ఏడాది విద్యా ఫీజు రూ.15,000లను రోటరీ క్లబ్ వరంగల్ సెంట్రల్ ఆధ్వర్యంలో చెల్లించడం జరిగింది. విద్యార్థి తల్లి కొంగ చందన భర్త కోవిడ్ సమయంలో మరణించడంతో కుటుంబ బాధ్యతలను ఒంటరిగా నిర్వహిస్తూ, తన కుమారుడిని ఉన్నత చదువులు చదివించాలనే ఆశయంతో రోటరీ క్లబ్‌ను ఆశ్రయించారు. దీనిపై వెంటనే స్పందించిన రోటరీ క్లబ్ సభ్యులు విద్యార్థి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పూర్తి విద్యా...