సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి – బాల్య వివాహాలను అరికట్టాలి
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి – బాల్య వివాహాలను అరికట్టాలి పిల్లల రక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి: తాడ్వాయి ఎస్ఐ ములుగు జిల్లా, నవంబర్ 2: ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌశెట్టివాయి గ్రామంలో సైబర్ నేరాలు, బాల్య వివాహాల నిర్మూలన, పోక్సో చట్టంపై తాడ్వాయి ఎస్ఐ ఆధ్వర్యంలో గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ, ప్రస్తుత రోజుల్లో సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాల్లో ప్రజలను మోసం చేస్తూ వారి బ్యాంకు ఖాతాల్లోని డబ్బులను కాజేస్తున్నారని తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాలు, అనుమానాస్పద లింకులు, నకిలీ ఉద్యోగ ప్రకటనలు,...