ఉర్దూ జర్నలిస్టులంతా ఐక్యంగా ముందుకు సాగాలి: రియాజ్ బేగ్

*టీయూడబ్ల్యూజేయూ పదో వార్షిక సర్వసభ్య సమావేశం, ఉత్తమ జర్నలిస్టుల అవార్డుల వేడుకకు అన్ని జిల్లాలు, మండలాల జర్నలిస్టులకు ఆహ్వానం* వరంగల్, నవంబర్ 4 : ప్రస్తుత పరిస్థితుల్లో ఉర్దూ జర్నలిస్టుల మధ్య ఐక్యత, సంఘీభావం ఎంతో అవసరమని తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీయూడబ్ల్యూజేయూ) వరంగల్, హనుమకొండ, ములుగు, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల కన్వీనర్ మీర్జా ఫతుల్లా బేగ్ రియాజ్ అన్నారు. యూనియన్ పదో వార్షిక సర్వసభ్య సమావేశం, ఉత్తమ జర్నలిస్టుల అవార్డుల ప్రదానోత్సవం ఉర్దూ జర్నలిస్టులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, వారిలో ఐక్యత, పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు చక్కటి అవకాశమని పేర్కొన్నారు. తెలంగాణలో ఉర్దూ జర్నలిస్టులకు ప్రాతినిధ్యం వహిస్తున్న...