అక్రమంగా తరలిస్తున్న 18 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి.. ఒకరు అరెస్ట్‌.. తుఫాన్ వాహనం స్వాధీనం ఆత్మకూరు: అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వ్యక్తిని వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 18 క్వింటాళ్ల రేషన్ బియ్యంతో పాటు బియ్యం తరలించేందుకు ఉపయోగించిన తుఫాన్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ ఏ. మధుసూదన్ ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం ఆత్మకూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని గూడెప్పాడ్ క్రాస్‌రోడ్డు వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న భోజ్జం బాను చందర్ (35)ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు హనుమకొండలోని గొల్లపల్లి పెట్రోల్ బంక్ సమీపంలో నివాసం ఉంటూ, రంగయ్యపల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించారు....