ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డీఎంహెచ్ఓ ఆకస్మిక తనిఖీలు
జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలి – జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య హనుమకొండ జిల్లా పరిధిలోని వంగర, ముల్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ఆరోగ్య కేంద్రాల్లోని మందుల నిల్వలు, మందుల పంపిణీ వివరాలు, ప్రయోగశాల రికార్డులు, వివిధ రిజిస్టర్ల నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించారు. రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని, నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని వైద్య సిబ్బందికి సూచించారు. అనంతరం జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరును సమీక్షించారు. మాతా శిశు ఆరోగ్య సేవలు, సాధారణ టీకాల కార్యక్రమం, హెచ్పీవీ టీకాల...