తిప్పర్తిలో సబ్‌జూనియర్ బాలుర కబడ్డీ జిల్లా స్థాయి ఎంపికలు

తిప్పర్తి: నల్గొండ జిల్లా సబ్‌జూనియర్ బాలుర కబడ్డీ జట్టు ఎంపికలు ఈరోజు పీఎంశ్రీ జడ్పీహెచ్ఎస్ తిప్పర్తి పాఠశాల ప్రాంగణంలో నిర్వహించారు. ఈ ఎంపికల్లో ప్రతిభ కనబరిచి ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 12వ తేదీ నుంచి వికారాబాద్ జిల్లాలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్‌లో నల్గొండ జిల్లా తరఫున పాల్గొననున్నారు. ఈ సందర్భంగా నల్గొండ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు భూలోకరావు, కార్యదర్శి కర్తయ్య మాట్లాడుతూ, క్రీడాకారులు క్రమశిక్షణతో సాధన చేసి రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తిప్పర్తి మండల విద్యాధికారి నర్సింహా నాయక్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు దామోదర్ రెడ్డి, డొమినిక్, లీల...